సినీ నటుడు మోహన్ బాబుని అరెస్టు చేయాలని జర్నలిస్టుల ర్యాలీ
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 11, కామారెడ్డి :
సినీనటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టు యూనియన్ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ మాట్లాడుతూ… జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆబిద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్, శంకర్, శివ, చక్రధర్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.