అఆ లు రాకపోయినా జర్నలిస్టులంటున్నారు..! సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

అఆ లు రాకపోయినా జర్నలిస్టులంటున్నారు..!

సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

– హైదరాబాద్‌లో మీడియా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు

మీడియా విశ్వసనీయత తగ్గుతోందని ఆందోళన

రాజకీయ పార్టీల పత్రికలు నిజాలు దాచడానికే పనిచేస్తున్నాయన్న ఆరోపణ

జర్నలిస్టుల స్థాయి దిగజారిందన్న ఆవేదన

అఆలు, ABCDలు రాని వాళ్లూ జర్నలిస్టులమంటూ తిరుగుతున్నారని ఎద్దేవా

వాస్తవాలను చెబితేనే మీడియా విలువ పెరుగుతుందని సూచన

మీడియా తీరుపై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మీడియా వ్యవస్థపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ ప్రముఖ దినపత్రిక వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ — “ఈ రోజుల్లో నిజంగా జర్నలిజం ఉన్నదా?” అనే ప్రశ్నను లేవనెత్తారు.రాజకీయ పార్టీల పత్రికలు తమ నేతల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, సంపాదనను రక్షించుకోవడానికే పనిచేస్తున్నాయని విమర్శించారు. “జర్నలిస్టు అనే పదానికి విలువ లేకుండా పోతోంది. అఆలు, ABCDలు కూడా రాని వాళ్లు సోషల్ మీడియాలో జర్నలిస్టులమంటూ తిరుగుతున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సమాజంలో నిగ్రహం, నిజాయితీ, విలువల్ని నిలబెట్టే పాత్రకే జర్నలిజం అని అభిప్రాయపడ్డ సీఎం — మీడియా సంస్థలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment