జర్నలిస్టులు దేశాభివృద్ధిలో భాగం కావాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్
ప్రశ్న ఆయుధం హైదరాబాద్ :
జర్నలిస్టులో దేశ అభివృద్ధిలో భాగం కావాలని జర్నలిస్టులు ఎప్పుడు నిజాలే చెప్పాలని కేంద్ర హోం సహాయం మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ 2025 డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడినా ఆయన నిజాలు మాట్లాడిన జర్నలిస్టులను కెసిఆర్ ప్రభుత్వం నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన సంగతి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టును అధికారంలోకి రాగనే సహకారంతో కేసీఆర్ మాట్లాడడం వల్లే కెసిఆర్ కు తగిన శాస్తి జరిగిందన్నారు.రేవంత్ ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు రావలసిన హక్కులను ప్రభుత్వం కల్పించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ జర్నలిస్టుల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉందన్నారు. జర్నలిస్టుల క్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు బిజెపి పాలిత ప్రాంతాల్లో చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులను ఎన్నికల్లో గెలిచే వరకే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని బిజెపి పార్టీ నాయకులు జర్నలిస్టులకు అండగా ఉండి జర్నలిస్టులకు రావలసిన హక్కులతోపాటు జర్నలిస్టుల శ్రేయస్ కొరకు కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీనికి సవినయంగా స్పందించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిశెట్టి రమేష్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు