సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ పార్థివదేహానికి ఆదివారం నాడు టీయూడబ్ల్యూజే-ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే.ఫైజల్ అహ్మద్ నివాళులు అర్పించారు. సంగారెడ్డిలోని సత్యనారాయణ నివాసంలో పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యనారాయణతో తమకు ఉన్న అనుబంధాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కార్యదర్శి విష్ణు ప్రసాద్, రాష్ట్ర నాయకులు కల్వల మల్లికార్జున్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు మురళీధర్ శర్మ, పానుగంటి కృష్ణ, ప్రభాకర్, నాగరాజు తదితరులు నివాళులు అర్పించారు. సత్యనారాయణ మృతి జర్నలిస్టు లోకానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
ఆర్.సత్యనారాయణకు నివాళులు అర్పించిన జర్నలిస్టులు
Published On: January 26, 2025 6:45 pm
