మేడిపల్లిలో నూతన జిల్లా కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు

*మేడిపల్లిలో నూతన జిల్లా కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు*

IMG 20250503 WA2265 మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మేము 3

మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయాన్ని మల్కాజిగిరి కోర్టు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి శ్రీదేవి శనివారం పరిశీలించారు. వారితో పాటు అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్ రెడ్డి, జిల్లా సివిల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్ కూడా భవన సముదాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

IMG 20250503 WA2266 కార్యక్రమంలో టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. న్యాయమూర్తులతో కలిసి ఆయన నూతన కోర్టు భవనంలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

IMG 20250503 WA2263 కోర్టు భవన సముదాయం యొక్క నిర్మాణ నాణ్యత మరియు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భవనం ప్రజలకు మెరుగైన న్యాయసేవలు అందించడానికి దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, నూతన కోర్టు భవనం మేడ్చల్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. త్వరితగతిన కోర్టు భవన నిర్మాణం పూర్తి చేసినందుకు ఆయన సంబంధిత అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now