*మేడిపల్లిలో నూతన జిల్లా కోర్టు భవన సముదాయాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు*
మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయాన్ని మల్కాజిగిరి కోర్టు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి శ్రీదేవి శనివారం పరిశీలించారు. వారితో పాటు అదనపు జిల్లా న్యాయమూర్తి రఘునాథ్ రెడ్డి, జిల్లా సివిల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్ కూడా భవన సముదాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, నూతన కోర్టు భవనం మేడ్చల్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. త్వరితగతిన కోర్టు భవన నిర్మాణం పూర్తి చేసినందుకు ఆయన సంబంధిత అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.