-నిజామాబాద్ జిల్లాలో 31 స్థానాలకు రిజర్వేషన్ల జాబితా విడుదల-
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్27
(ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ జిల్లా పరిధిలోని 31 మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల పరిషత్ సభ్యుల (ఎంపీపీ) రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2025లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ తుది దశకు చేరుకుంటుండడంతో జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది.
జడ్పీటీసీ స్థానాల కేటాయింపు ఇలా:
బీసీలు: 12,జనరల్: 10,ఎస్సీలు: 5,ఎస్టీలు: 3
ఎంపీపీ స్థానాల కేటాయింపు:
బీసీలు: 12,జనరల్: 10,ఎస్సీలు: 5,ఎస్టీలు: 3
మహిళలకు ప్రాధాన్యం:
ఈసారి ఎన్నికల్లో మహిళలకు మొత్తం 14 జడ్పీటీసీ & ఎంపీపీ స్థానాలు కేటాయించబడ్డాయి. అన్ని వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడంతో వారికి ఈసారి అత్యధిక అవకాశాలు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50% రిజర్వేషన్ మహిళలకు వర్తింపజేయడంతో ఈ కేటాయింపులు జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, రిజర్వేషన్ల ప్రకటనతో స్థానిక రాజకీయాల్లో చురుకుదనం పెరిగింది.