న్యాయ అవగాహన సదస్సు

న్యాయ అవగాహన సదస్సు – కామారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ హై స్కూల్, పాల్వంచ లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ అవగాహన సదస్సు లో బాల్య వివాహ నిషేధ చట్టం, POCSO చట్టం వంటి ముఖ్యమైన చట్టాల గురించి , ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 21, డ్రగ్స్ మరియు పలు అంశాలపై అవగాహన విద్యార్థులకు కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఏదైనా సమస్యలు ఎదురైనపుడు టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చేయొచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో MRO హిమబిందు గారు , MEO శ్రీరామ్ గారు, పి. గోవర్ధన్ రెడ్డి, హెడ్ మాస్టర్, స్వర్ణ లత, CWC మెంబెర్, మాయ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సురేష్, శ్రీనివాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్  కౌన్సెల్, మనోహర్ రావు గారు, మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సిబ్బంది సమీ అల్లాహ్ ఖాన్, సందీప్ , నర్సింహా చారి , మరియు పాఠశాల సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now