Site icon PRASHNA AYUDHAM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ 

IMG 20241118 WA0093

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో జుక్కల్ ఎమ్మెల్యే భేటీ

జుక్కల్ ఆర్సీ నవంబర్ 18 ప్రశ్న ఆయుధం

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు నాందేడ్ కు వచ్చిన నీటిపారుదల, ఆహారం & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం  కుమార్ రెడ్డి ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు..

ఈ సందర్బంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్ధులో గల

లెండి ప్రాజెక్ట్ పనులు ప్రారభించి దాదాపు 35 ఏళ్ళు కావస్తున్నా పూర్తవడం లేదని, ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయి అని మంత్రి కి వివరించారు.

ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అయితే జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్,జుక్కల్,బిచ్కుంద మండలాలలో దాదాపు 26 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి కి ఎమ్మెల్యే తెలిపారు.

ప్రాజెక్టు వల్ల జుక్కల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలుసుకున్న మంత్రి  సానుకూలంగా స్పందించారు.. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు..

ఎమ్మెల్యే మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు..

Exit mobile version