రాంకిష్టయ్య ప్రథమ వర్ధంతి పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
నిజాంసాగర్, అక్టోబర్ 23 ప్రశ్న ఆయుధం
పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నిజాంసాగర్ మండలం మాగి గ్రామ వాస్తవ్యుడు చీకోటి రామకృష్ణయ్య ప్రథమ వర్ధంతిని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాంకిష్టయ్య కుమారులు వారి కుటుంబ సభ్యులు బుధవారం రోజున నిజాంసాగర్ మండలం మాగి జి ఎస్ ఆర్ చక్కెర ఫ్యాక్టరీ వద్ద గల ఫామ్ హౌస్ లో రాంకిష్టయ్య ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజాంసాగర్, మహమ్మద్ నగర్, పిట్లం మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాంకిష్టయ్య ప్రథమ వర్ధంతి పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే..
by kana bai
Published On: October 23, 2024 4:46 pm