జాతీయ జెండాను ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే
ప్రశ్న ఆయుధం 26 జనవరి (బాన్సువాడ ప్రతినిధి)
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ పటేల్,కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయ్,దిలీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.