జులై 9 దేశవ్యాపిత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి

జులై 9 దేశవ్యాపిత కార్మిక సమ్మెను జయప్రదం చేయండి

 

– బహుజన వామపక్ష కార్మిక సంఘాల,జేఏసీ,రాష్ట్ర కమిటీ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 8

 

కామారెడ్డి జిల్లా పాల్వంచ, మచరెడ్డి, పరిదిపేపేట్,లాంగర్ బీడీ, దేశాయిబీడీ, వి ఎస్ ఠాకూర్ బీడీ సెంటర్ లో నేడు జరిగే జాతీయ సమ్మె లో మచరెడ్డి,పాల్వంచ బీడీ సెంటర్ లో పనిచేయు కార్మికులు పాల్గొంటారనీ ఆయా కంపెనీల సెంటర్ మేనేజర్లు కు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, ఆద్వర్యంలో సమ్మె నోటీసు అందించారు. తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ( బిఎల్ టీయూ ) రాష్ట్ర అధ్యక్షులు యస్, సిద్దిరాములు ,రాష్ట్ర ఉపాద్యక్షులు నగరపు యెల్లయ్య లు మాట్లాడుతూ

బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ, భాగస్వామ్య కార్మిక సంఘాలు, ఎఐసిటీయు, బిఎల్ టీయూ, టీ యుసిఐ,ఎఐఎప్ టీయూ,ఐఎప్ టీయూ, టీయస్ పి యస్, కే హెచ్ పియస్,టీఎప్ టీయూ, బిఎప్ టీయూ,తదితర కార్మిక సంఘాల జెఎసి ఆద్వర్యంలో జులై 9,న జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. జూలై 9,న జరిగే జాతీయ సమ్మె లో తెలంగాణ రాష్ట్రములోని అన్ని రంగాల కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

స్వతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మెది ప్రభుత్వం రద్దుచేసి, పెట్టు బడి దారులకు అదాని, అంబనీ లకు ఉపయెగ పడే చట్టలను తిసుకరవడం, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, బీడీ పరిశ్రమ ప్తె పెట్టిన ఆంక్షలు ఎత్తి వేయాలని, జి,యస్, టీ,కోఫ్టా చట్టం రద్దు చేయాలని, యావత్తు కార్మికలోకం ముక్తకంఠంతో నినదిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పోరేట్ పెట్టుబడుదారుల ప్రయోజనాల కోసం దేశ ప్రజలు కార్మికుల పైన భారాలు వేస్తూ ధరలు పెంచుతూ కార్మికుల పనిగంటలు పెంచుతూ కనీస వేతనాలు ఇవ్వకుండా ప్రజల్ని, కార్మికుల్ని హక్కులు లేకుండా కట్టు బానిసల్లాగా దిగజారుస్తూ ప్రజాస్వామ్య దేశంలో నియంత పరిపాలన లాగా మారుస్తూ రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల్ని తొలగిస్తున్నారన్నారు. యావత్తు కార్మిక లోకం ప్రజా హక్కుల కోసం జరుగుతున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు, జూలై 9,న జరిగే జాతీయ సమ్మె ను ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంతో బిఎల్ టీయూ జిల్లా నాయకులు, కుమ్మరి రవి,దర్గయ్య,శాంశు,వెంకటి,నర్సిములు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now