నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఎడపల్లి నవంబర్ 14:
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలన్ గ్రామంలో గల ప్రాధమిక సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఇంజర్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డితో కలసి పరిశలించారు.
ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు, ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి పాలనలో సోనియమ్మ నాయకత్వంలో ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి సరైన ప్రణాలికను రూపొందిస్తున్నామని, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పని సరిగా నెరవేస్తామని అన్నారు. వరి కొనుగోలు ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని అన్నారు, హామీ ఇచ్చిన ప్రకారం సన్న రకానికి 500 రూపాయల బోనస్ తప్పనిసరిగా అందచేస్తామని అన్నారు. పంట మార్పిడి ద్వారా భూమి సారవంతం అవుతుంది అంతే కాకుండా పంట దిగుబడి కూడ పెరుగుతుంది రైతులకు సూచించారు. బిఆర్ఎస్ నాయకులు వారి రాజకీయ లబ్ది కోసం చేసే ప్రక్రియను మాటలను నమ్మవద్దని తెలిపారు.
గత ప్రభుత్వం ఎన్నికల ముందు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లుగా 6000 కోట్లు రూపాయలు రైతు భరోసా ఇచ్చారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే, ఎలా ఇచ్చారు రాష్ట్ర కజనలో డబ్బులు లేకపోయినా, సంవత్సరానికి సుమారుగా 800 నుండు 1000 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తున్న ORR ను కేవలం 7000 కోట్లకు 35 సంవత్సరాలు పాటు ప్రైవేట్ సంస్థకు అమ్మేస్తే వచ్చిన డబ్బుతోనే రైతు భరోసా ఇచ్చారు అని అన్నారు
60వేల కోట్లు అప్పులు ఉన్న రాష్ట్రం బిఆర్ఎస్ హయంలో అది కాస్త 8 లక్షల కోట్లు అప్పులున్న రాష్ట్రంగా మార్చిన ఘనత కెసిఅర్ దే అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు నెలకు 6 వేల కోట్లు రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించి సరైన ప్రణాలికను రూపొందిస్తున్నామని, గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు అన్నీ అమలుచేస్తు, ఆరు గ్యరంటీలు అమలుచేస్తామని అన్నారు. 20 వేల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో సుమారు 3220 ఇందిరమ్మ ఇళ్ల కు 170 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజలు, రైతులు పాల్గొన్నారు.