ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి: ప్రత్తిపాటి..
సంచలనంగా మారిన ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో నష్టపోయిన ప్రతిఒక్క బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. మాజీ మేనేజర్, గోల్డ్ అప్రైజర్ కలసి కోట్లాది రూపాయలకు మోసం చేస్తుం టే బ్యాంకు యంత్రాంగం కళ్లు మూసుకుందా అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మొదట చిలకలూరిపేట అనుకుంటే నరసరావుపేటలోనూ ఇదే తరహా మోసం వెలుగుచూడడం, అదే మేనే జర్ విజయవాడలోనూ పనిచేయడంతో అక్కడ ఇంకా ఏం చేసి ఉంటారనే అనుమానలు కలుగు తున్నాయన్నారు. ఇదే విషయంపై మంగళవారంం మీడియాకు లేఖ విడుదల చేశారు ప్రత్తిపాటి.
ఇంటిదొంగలే కోట్లు కొల్లగొట్టిన ఈ కేసులో సీబీఐ విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉం దన్నారు. బ్యాంకులో మాయం అయిన బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ప్రతి పైసా ఖాతాదారులకు తిరిగివ్వాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి నిర్దుష్టమైన హామీ ఇవ్వడ ంతో పాటు, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అసలు ఇంతపెద్దమొత్తంలో మోసం జరిగే వరకు బ్యాంకు ఉన్నతాధికారుల పసిగట్టకుండా ఉండడం విచారకరం అన్నారు ప్రత్తిపాటి. సాధారణంగా ప్రతిబ్యాంకులో బంగారానికి సంబంధించి ఆడిట్ జరుగుతుందని…. కానీ ఈ కేసులో అలా ఆడిట్ జరగలేదా…. లేదంటే ఆ పై స్థాయివాళ్లు కూడా కుమ్మక్కయ్యారా అనే ప్రశ్నలకు బ్యాంకు సమాధానం చెప్పా లన్నారు. నమ్మకంగా, భద్రంగా ఉంటాయని బ్యాంకుల ను ఆశ్రయిస్తే అక్కడ కూడా ఇలా జరిగితే ఎలా ఆలోచించుకోవాలని సూచించారు. డిపాజిట్లు, రుణాలకు సంబంధించి రశీదులపై ఏమైనా అనుమానాలుంటే ఆయాతేదీల సీసీ ఫుటేజీలను పరిశలించి అయినా బాధితులకు న్యాయం చేయాలి తప్ప, నష్టపోయిన వారిని మరింత ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని, మరొక్కసారి ఇలాంటివాటికి అస్కారం లేకుం డా సరిదిద్దుకోవాలని స్పష్టం చేశారు.