రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం జగ్గంపేట వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ప్రతి సంవత్సరం కాశీ కావిడి యాత్ర నిర్వహిస్తారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకొని యాత్ర చేస్తూ పాదయాత్రగా వెళ్తున్న మార్వాడీలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారిని అభినందించి వారితో పాటు కావిడి కొద్ది దూరం మోయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడీలు మాట్లాడుతూ శివ, కేశవలకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడి నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి ఈ కావిడి యాత్ర చేస్తున్నామని ఈరోజు మేము చేస్తున్న ఈ దైవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, వేములకొండ జోగారావు, భారత్ మాలి, అధిక సంఖ్యలో మార్వాడీలు పాల్గొన్నారు..