Headlines in Telugu:
-
“కడవేర్గు వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: సిపిఐ నేత అందే అశోక్”
-
“కడవేర్గు వంతెన పనుల్లో అవకతవకలను నివారించండి: అందే అశోక్ ఆదేశం”
-
“సిపిఐ నేత అందే అశోక్ నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు”
-
“సిపిఐ నాయకులు నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని డిమాండ్”
-
“కడవేర్గు వంతెన పనులపై సిపిఐ నేత అందే అశోక్ ఆందోళన”
*సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్*
*చేర్యాల ప్రశ్న ఆయుధం ప్రతినిధి*
చేర్యాల మండలం లో కడవేరుగు గ్రామంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్ డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు వంతెన నిర్మాణ పనులను, సామగ్రిలను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుంచి సీపీఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, నిరసనలు, వినతి పత్రాలు, ధర్నాలు నిర్వహించి వంతెన సాధించుకున్నామన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 2 కోట్ల 70 లక్షల నిధులు కేటాయించారని, ఆ నిధులను దండుకునేందుకు కాంట్రాక్టర్, సూపర్వైజర్ కుమ్మక్కై నాసిరకం సిమెంటు, కంకర, ఇసుక, కంకర పొడి వాడుతున్నారని ఇలా వాడితే కొద్ధి కాలానికే పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యల తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ డివిజన్ నాయకుడు జంగిలి యాదగిరి, డివిజనల్ కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి, ఎల్లయ్య, గుడిసె రాజు, పోతుగంటి మల్లయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.