సెయింట్ ఆంథోనీ భాషోపాధ్యాయునికి “కాకతీయ మహానంది పురస్కారం”

మహానంది
Headlines :
  • సెయింట్ ఆంథోనీ భాషోపాధ్యాయుడు ఉమ్మన్నగారి కృష్ణగౌడ్‌కు కాకతీయ మహానంది పురస్కారం
  • హనుమకొండలో కాకతీయ మహానంది పురస్కారం అందుకున్న ఉమ్మన్నగారి కృష్ణగౌడ్
  • ప్రజ్ఞను గుర్తించిన అంజలి మీడియా గ్రూప్, కృష్ణగౌడ్‌కు సత్కారం

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సెయింట్ ఆంథోనీ భాషో పాధ్యాయుడు ఉమ్మన్నగారి కృష్ణగౌడ “కాకతీయ మహానంది పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాలోని హనుమకొండలో నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ లో జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు అనిత రెడ్డి, డాక్టర్ భగీరథ, డాక్టర్ రామకృష్ణ, రోజీల చేతుల మీదుగా కృష్ణ గౌడ్ అవార్డు అందుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ శాంతినగర్ స్థానిక విద్యా సంస్థ అయిన సెయింట్ ఆంథోనీ విద్యా సంస్థలో భాషోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జాన పద గేయాలు, భక్తి పాటలు, ప్రముఖ నాయకులకు గేయాలు రాస్తూ ముందుకు సాగుతున్నారు. వీరి స్వస్థలం, సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాలేల్మ గ్రామానికి చెందిన ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్, సాహిత్య విభాగంలో తనదైన ముద్ర వేస్తూ సామాజిక అంశాలపై స్పందిస్తూ, రచనలు చేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ వేదికలకు వ్యాఖ్యాతగా పని చేస్తూ వాక్చాతుర్యంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ సాహితీ సంస్థల నుండి, ఫౌండేషన్ ల ద్వారా అనేక పురస్కారాలు తీసుకున్నారు. ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్ చే విరిచితమైన రచనలు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర కవితా సంకలనం, సముద్రమంత హృదయం అని పుస్తకాలు రాశారు. వీరి ప్రజ్ఞను గుర్తించి అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ 10వ వార్షికోత్సవం సందర్భంగా వీరికి నవంబరు 2న *కాకతీయ మహానంది పురస్కారం* ప్రముఖ సినీ, రాజకీయ నాయకులచే అందజేసినట్లు అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ యాజమాన్యం తెలిపారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఉమన్నగారి కృష్ణా గౌడ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. అంజలి మీడియా గ్రూప్ యాజమాన్యం చైర్మన్ కామిశెట్టి రాజు అండ్ గ్రూప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాలోని హనుమకొండలో నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం, పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి,కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అనితరెడ్డి, డాక్టర్ భగీరథ, డాక్టర్ రామకృష్ణ, రోజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మన్నగారి కృష్ణగౌడ్ కాకతీయ మహా నంది పురస్కారం అందుకున్నందుకు విద్యాసంస్థ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now