భారతదేశం గర్వించదగ్గ సేవలు చేసిన కలాం

*అబ్దుల్ కలాం చిత్రం వేసిన రామకోటి రామరాజు*

మెదక్/గజ్వేల్, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): అబ్దుల్ కలం 10వ వర్ధంతిని పురస్కరించుకొని గజ్వేల్ కు చెందిన కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సబ్బుబిళ్ల మీద అద్భుతంగా అబ్దుల్ కలాం చిత్రాన్ని చిత్రించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భావి తరాలకు ఆదర్శప్రాయుడు అని అన్నారు. పేపర్ భాయ్ గా కుటుంబానికి ఆసరగా నిలిచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని తెలిపారు. ఆయనో భారతరత్న… ఆయనో రాష్ట్రపతి… ఆయనో రచయిత అని, ఖురాన్ అంటే అభిమానం, భగవద్గీత అంటే మమకారం, మహోన్నతమైన మానవతావాది. భారత్ అణ్వస్త్ర పితామహునిగా పేరు గాంచిన కలాంకు మా సలాం అని అయన సేవలను కొనియాడారు. మన జననం ఓ సాధారణమైనదే కావొచ్చు కానీ మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేదిగా ఉండాలని అయన మాటలు మరవొద్దన్నారు.

Join WhatsApp

Join Now