భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా కల్లూరు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక చోటు చేసుకుంది. గతంలో రెండుసార్లు డివిజన్ కార్యదర్శిగా ఎన్నికైన కల్లూరి పార్టీ కెనలేని సేవలు చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సమితి సభ్యులుగా, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నిర్మాణ బాధ్యులుగా కొనసాగుతున్నారు. మరోసారి డివిజన్ పార్టీ బాధ్యతలను పార్టీ ఆయనకు అప్పగించింది. ఈ సందర్భంగా కల్లూరి మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సిపిఐ ని గ్రామ గ్రామాన విస్తరింప చేసేందుకు కృషి చేస్తానని, డివిజన్ వ్యాప్తంగా సిపిఐ వందేళ్ళ జయంతి వేడుకలు నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యలు రావులపల్లి రవికుమార్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ డివిజన్ కార్యదర్శిగా కల్లూరి
