జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 9
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ – “కాళోజీ తన కవిత్వం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తెచ్చారు. ఆయన రచనలు, ఉద్యమాలు, ప్రజల్లో చైతన్యం నింపాయి. యువత ఆయన స్ఫూర్తిని తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
అలాగే కాళోజీ, సాధారణ ప్రజల కష్టాలను అక్షరాల్లో ప్రతిబింబించారని, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా పరిరక్షణకు, ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడని కీర్తించారు. పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న కాళోజీ గారి ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి, అదనపు ఎస్పీ కే. నర్సింహారెడ్డి, ఆర్ఐలు, డిపిఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.