తెలంగాణగల్ఫ్ బాధితులకు కల్వకుంట్ల కుటుంబం క్షమాపణ చెప్పాలి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు డిమాండ్.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గల్ఫ్ బాధితులకు కల్వకుంట్ల కుటుంబం క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వాడి కృష్ణారావు అన్నారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుచు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతం నుండి గల్ఫ్ పోవలసిన అవసరం ప్రజలకు ఉండదని నమ్మబలికి ఇంటికిఒక ఉద్యోగం ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మించి ప్రజలను మోసం చేశాడనిఅన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉత్తర తెలంగాణ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు ప్రజలు వలస వెళ్లారని దీన్ని దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని ఆనాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీవిషయం ప్రజలందరికీ తెలుసు అని కృష్ణారావు అన్నారు.కోరుట్ల నియోజకవర్గం లో అత్యధికంగా వివిధ గల్ఫ్ దేశాల్లో మరణించగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, అధికారిక ఉత్తరం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బాధితుల సమస్యను తెలియజేశామని దీంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాధితులు అందరికీ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కోరుట్ల నియోజకవర్గంలో మరణించిన గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారని జువ్వాడి కృష్ణారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గల్ఫ్ బాధితుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండ్రీకొడుకులు అధికారాన్ని అనుభవించి ప్రజలను మోసం చేశారని అన్నారు గల్ఫ్ పోయే పరిస్థితి ఉత్పన్నం కాదు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు 2014 నుండి అధికారం అనుభవించిన పది సంవత్సరాల లో మరణించిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ప్రతి కుటుంబానికి కల్వకుంట్ల సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు క్షమాపణ చెప్పాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. గల్ఫ్ లో మరణించిన మొహ్మద్ నబి కుటుంబానికి ఎక్స్ గ్రేసియా పత్రాలను అందజేశారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పన్నాల అంజిరెడ్డి, జిల్లా బి సి సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, కౌన్సిలర్ సంగ లింగం, పోతుగంటి శంకర్ గౌడ్, చేపూరి కృష్ణారెడ్డి, అభి , పడాల లచ్చయ్య, సదుల వెంకటస్వామి, నల్ల రామరాజ్, ఎంబేరి సత్యనారాయణ, చల్ల పురుషోత్తమ్, చిట్యాల లక్ష్మీనారాయణ, తెడ్డు విజయ్ దశరథం, పల్లపు అశోక్, బొల్లె అక్షయ్, తోట్ల మహేష్, బుస రాజేష్, తదితరులు పాల్గొన్నారు