*కల్వల ప్రాజెక్టు మరమ్మత్తులు పూర్తి చేసే భాధ్యత కాంగ్రెస్ పార్టీది*
*రాజకీయ కోణంలో కాకుండా రైతుల గురించి ఆలోచిస్తాం*
*రైతులకు న్యాయం చేసేలా కృషీ చేస్తా*
*ఆందోళన వద్దు-ఆదుకునే భాధ్యత నాది*
*కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్*
*జమ్మికుంట/వీణవంక ప్రశ్న ఆయుధం ఆగస్టు 27*
కల్వల ప్రాజక్టు కింద ఉన్న రైతులకు న్యాయం జరిగేలా త్వరలోనే నిర్మాణ పనులు జరిగేలా చూస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు రాజకీయ కోణంలో కాకుండా రైతులకు ఉపయోగపడే ప్రాజక్టుపరంగా మరమ్మత్తు పనులు పూర్తి చేస్తామని రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని భారీ వర్షాలకు వరదలకు ప్రాజెక్టు డ్యామేజ్ అయినప్పుడు అధికారంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం వారు అప్పుడే మరమ్మత్తులు చేపట్టి ఉంటే ఇప్పటికీ కల్వల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు ఉపయోగపడేదని ప్రాజక్టు నిర్మాణం చేపడతామని ప్రాజెక్టు జీవనాధారమై ఆధారపడి బ్రతికే వారు ఎవరు అధైర్యపడొద్దని సంభందిత అధికారులతో మాట్లాడి ప్రాజక్టు సందర్శించి మరమ్మత్తు పనులు పూర్తి చేస్తానని రానున్న రెండు,మూడు రోజుల్లో ప్రాజెక్ట్ సందర్శించి పూర్తి వివరాలు అధికారుల ద్వారా అంచనావేసి మరమ్మత్తులు పనులు ప్రారంభిస్తామని ప్రణవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు