కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి 

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం నవంబర్ 26: కూకట్‌పల్లి ప్రతినిధి 

ప్రజా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది 

సంక్షేమ పథకాలలో ఎలాంటి రాజకీయాలు ఉండవు 

ఎవరైనా అలా అనుకుంటే వారి భ్రమే

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది 

ఆరు గ్యారెంటిల అమలే లక్ష్యం 

3.54 లక్షల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం 

మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి

ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో మూడు కోట్ల 54 లక్షల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ప్రజలు ఆశతో ఉంటారని ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని అలా ఎవరైనా భావిస్తే వారి భ్రమే అవుతుందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి B బ్లాక్ అధ్యక్షులు తుమ్మూ వేణు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరావు వెంకటేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ కృష్ణ రాజ్ పుత్, సతీష్ గౌడ్, మహమ్మద్, మేకల రమేష్, మధు గౌడ్, లక్ష్మినారాయణ, మస్తాన్ రెడ్డి, కనకయ్య ముదిరాజ్,అక్బర్, శివ చౌదరి, నలిని కాంత్,భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment