ఎన్ కౌంటర్ లో కామాంధుడు హతం

*ఎన్ కౌంటర్ లో కామాంధుడు హతం*

*నిందితున్ని కొద్ది గంటల్లోనే కాల్చి చంపిన ఎస్సై అన్నపూర్ణ*

కర్ణాటకలోని హుబ్బిల్లి లో ఐదేళ్ల చిన్నారి అపహరణ హత్య కేసులో నిందితుడు పోలీసులు ఎన్కౌంటర్ లో హతమయ్యాడు, ఘటన లో పోలీసులు కూడా గాయ పడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన నితీష్ కుమార్(35) గా గుర్తించారు.

ఈ ఘటన. కొప్పళకు చెంది న ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హుబ్బళ్లికి వలస వచ్చింది. చిన్నారి తండ్రి పెయింటర్‌. తల్లి గృహిణి. ఆదివారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది. చిన్నారి ఇంటి బయట ఆడుకుం టుండగా, ఒక యువకుడు చాక్లెట్‌ ఆశ చూపి ఆమెను సమీపంలోని ఓ పాడు బడిన షెడ్డుకు తీసుకెళ్లాడు.

అక్కడ అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఓ యువకుడు బాలికను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. షెడ్డులో చిన్నా రి శవమై కనిపించడంతో ప్రజా, కన్నడ, యువ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.

మరోవైపు, నిందితుడిని బిహార్‌కు చెందిన రితేశ్‌కుమార్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదు పులోకి తీసుకునేందుకు యత్నించారు. అతడు తప్పించుకునే ప్రయత్నంలో ఎదురు దాడికి దిగగా పోలీసులు కాల్పులు జరిపారు. నితేశ్‌కుమార్‌ ఛాతీలోకి బుల్లెట్‌ దూసు కెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment