*కమనీయం రమణీయం గోదా రంగనాథస్వామి కళ్యాణం*
*జమ్మికుంట జనవరి 13 ప్రశ్న ఆయుధం:*
జమ్మికుంట పట్టణంలోని శ్రీ భగవద్గీత జ్ఞాన మందిరంలో ధనుర్మాసం పురస్కరించుకొని మంగళవారం శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం కడుకమనీయం రమణీయంగా నిర్వహించారు. గోదా రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ వారు ఆలయ ప్రధాన అర్చకులు మరిగంటి సంతోష్ ఆచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరీంచడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం జరిగింది.ఈ సందర్భంగా భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పురం వైకుంఠం గర్రపెళ్లి సతీష్ కుమార్ చిదురాల శ్రీనివాస్ పత్తి జనార్ధన్ రెడ్డి రాజశేఖర్ కంభంపాటి శివశంకర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్ యంసాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.