Site icon PRASHNA AYUDHAM

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు – జిల్లా ఎస్.పి. సిహెచ్. సింధు శర్మా   

పోలీసు
Headlines
  1. కామారెడ్డి జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు
  2. ర్యాలీలు, నిరసనలకు నో: జిల్లా ఎస్పీ హెచ్చరిక
  3. ప్రజా భద్రత కోసం 30(ఎ) పోలీసు యాక్ట్ అమలులోకి
  4. డిసెంబర్ 1-7: కామారెడ్డిలో రాస్తారోకోలకు నిషేధం
  5. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ కీలక చర్యలు

– జిల్లా ఎస్.పి.  సిహెచ్. సింధు శర్మా                                                             కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని ( డిసెంబర్ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్.పి. సిహెచ్.సింధు శర్మా తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజల దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version