కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గము సాధారణ సమావేశం.
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం పాలకవర్గం, కార్యాలయ సిబ్బంది సాధారణ సమావేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో నిర్వహించారు. సమావేశంలో వడ్లకొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు జరగకుండా తగిన సామాగ్రి సమకూర్చాలని తీర్మానించడం జరిగింది. అలాగే గడచిన మూడు నెలల్లో మార్కెట్ కమిటీ యొక్క ఆదాయవ్యయాలు, అభివృద్ధిపై చర్చించరూ. గ్రేడ్3 సెక్రెటరీగా పనిచేస్తూ మృతి చెందిన నర్సింలు మౌనం వహించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మినుకురి బ్రహ్మానందరెడ్డి, డైరెక్టర్లు వలిపిశెట్టి లక్ష్మీరాజం, అవుసుల బ్రహ్మం, నూనవత్ గణేష్ నాయక్, దోమకొండ శ్రీనివాస్, మక్బూల్, రాజలింగం, కొత్త అరవింద్, జ్యోతిరెడ్డి, భూమయ్య, సుదర్శన్ రావు, జిల్లెల భూపతి రెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.