కామారెడ్డి బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
కామారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం బార్ అసోసియేషన్ భవనంలో ఎన్నికల అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అద్యక్షుడు గా నంద రమేష్, ఉపాధ్యక్షుడిగా చికోటీ మురళి, ప్రధాన కార్యదర్శిగా బండారి సురేందర్ రెడ్డి, ఉప కార్యదర్శి గా మోహన్ రెడ్డి, కోశాధికారిగా వేణుప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా ఎం. డి.సలీం, అంగ్రేజీ, విఠల్ రావు, యాదగిరి, ఆన్సర్ అలీ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నంద రమేష్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై ఎల్లప్పుడూ ముందు ఉండి న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్, జిల్లా అదనపు జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బట్టు దీక్ష తదితరులు పాల్గొన్నారు.