Site icon PRASHNA AYUDHAM

బీడీ కార్మికులకు,ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,క జీవన భృతి ఇవ్వాలి

బీడీ
Headlines :
  1. బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్
  2. కామారెడ్డి: బీడీ కార్మికుల ర్యాలీ – 4016 రూపాయల జీవన భృతి కోసం పోరాటం
  3. తెలంగాణ బీడీ కార్మిక సంఘం: పాత కటాఫ్ తేదీని తొలగించి 4016 రూపాయలు ఇవ్వాలని అభ్యర్థన

2014,పిబ్రవరి 28,కటాఫ్ తేదీని తొలగించి, బీడీ కార్మికులకు,ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,క జీవన భృతి ఇవ్వాలి

కామారెడ్డి జిల్లా కేంద్రం లో బిఎల్ టీయూ జిల్లా కార్యాలయం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట అద్యకులు, యస్, సిద్దిరాములు, రాష్ట,ఉపాద్యక్షులు,నాగారపు యెల్లయ్య, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎఫ్ టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు, యస్, అనూసుయ, జిల్లా అధ్యక్షురాలు, టీ,వెంకట్ లక్ష్మి, తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికుల కు ప్యాకర్లు, బట్టి, చటన్,టేకేదార్లకు,2014,పిబ్రవరి 28,న కటాఫ్ తేదీని తొలగించి, ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,జీవన భృతి ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ, డిసెంబరు 11,బుధవారం కామారెడ్డి సీఎస్ఐ,చార్చి నుండి, కామారెడ్డి కలెక్టరు కార్యాలయం వరకు బారీ ర్యాలి, కలెక్టరు కార్యాలయం ముందు దర్నా ఉంటుందని, దీనికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామల,అన్ని బీడీ కంపెనీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండు ఎన్నికలలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ ఎలాంటి షరతులు లేకుండా 2016,రూ,జీవన భృతి నుండి 4016,రూ,వరకు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం బీడీ కార్మికుల ఓట్ల తో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సంవత్సరం గడిచిన నేటికి బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. డిసెంబరు 9,నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీడీ కార్మికులకు తగిన బడ్జెట్ కేటాయించి , అందరికీ జీవన భృతి ఇవ్వాలని లేనిచో ఈ ప్రభుత్వం కు బీడీ కార్మికులు తగిన బుద్ధి చెప్పుతారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, జిల్లా నాయకురాలు, కే,గంగ మణి, గంగాధర్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version