Headlines
-
కామారెడ్డిలో బోరు మోటార్ ప్రారంభోత్సవం
-
15వ ఫైనాన్స్ నిధులతో దేవునిపల్లిలో అభివృద్ధి
-
మున్సిపల్ పరిధిలో మౌలిక వసతుల పురోగతి
-
స్థానిక ప్రజల అవసరాలకు కొత్త బోరు మోటార్
-
కామారెడ్డి అభివృద్ధిలో మరో ముందడుగు
ప్రశ్న ఆయుధం, నవంబర్ 23, కామారెడ్డి :
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో గల 12 వ వార్డులో 15 వ ఫైనాన్స్ నిధుల కింద సుమారు 3,20,000 రూపాయలతో శనివారం బోరు మోటారు ప్రారంభించారు. ఈ బోరు మోటార్ ను కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు స్థానిక కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి, 35 వ వార్డు కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు, నీలం రాజలింగం, బాలస్వామి, హరహర సిండికేట్ సభ్యులు, విద్యుత్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.