భారత్ ను విశ్వ గురువుగా చేయాలన్నదే నరేంద్ర మోదీ కల..!

భారత్
Headlines
  1. కామారెడ్డిలో BRS నేతలు BJPలో చేరిక, మోదీ కల గురించి MLA రమణ రెడ్డి ప్రకటన
  2. “కామారెడ్డిలో BJP బలోపేతం – రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై దృష్టి”
  3. “నరేంద్ర మోదీ కల: భారత్‌ను విశ్వ గురువుగా చేయడమే లక్ష్యం – కామారెడ్డి BJP నాయకులు”


-కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం అయ్యింది

-10 కోట్ల మంది బీజేపీ లో సభ్యులుగా చేరారు

-కామారెడ్డి మున్సిపల్ బీజేపీ కైవసం

-కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27:

కామారెడ్డి పట్టణంలోని 15 వ వార్డుకి చెందిన బిఆర్ఎస్ నాయకుడు భూమేష్ యాదవ్ తో పాటు 21 మంది కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారత్ ను విశ్వ గురువుగా చేయాలన్నదే నరేంద్ర మోదీ కల అని వికసిత భారత్ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్ళ కాలంలో బీజేపీ కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలోపేతం అయ్యిందనీ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయ్యి 2 నెలలు కాక ముందే 10 కోట్ల మంది బీజేపీ లో సభ్యులుగా చేరారనీ అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి లోని అన్ని వార్డులు బీజేపీ గెలిచి ఛైర్మెన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

Join WhatsApp

Join Now