ఎల్లారెడ్డి, అక్టోబర్ 15, (ప్రశ్న యుధం):
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం సోమవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని, ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ సభ్యుడు రాజ్‌పాల్ ఖరోలా ని శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం “ఓట్ చోర్ గడ్డి చోడ్” ఉద్యమానికి మద్దతుగా, రాహుల్ గాంధీ పోరాటానికి ప్రజా మద్దతు సమీకరించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసే, ప్రజలతో కలిసిమెలసి పనిచేసే నాయకుడిని ఎంపిక చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.