Headlines :
-
కామారెడ్డి: వికలాంగుల సదరం సర్టిఫికెట్లు, పెన్షన్ల సమస్య
-
వికలాంగుల హక్కుల పోరాటం: సదరం సర్టిఫికెట్లు రావడం లేదని ఆవేదన
-
వికలాంగులకు అండగా కోలా బాలరాజ్ గౌడ్: సమస్యలపై త్వరలో చర్యలు తీసుకుంటాం
– వికలాంగుల హక్కు ల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు
కామారెడ్డి జిల్లాలో సదరం సర్టిఫికెట్లు రావడంలేదని సదరం సర్టిఫికెట్లు వచ్చిన వారికి పెన్షన్లు రావడం లేదని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోలా బాలరాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని రామారెడ్డి మండలంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు వికలాంగులు తమ ఆవేదనను తెలిపారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం కేంద్రాలలో వికలాంగులకు సర్టిఫికెట్లను ఇవ్వడంలేదని, సదరం సర్టిఫికెట్లను అందజేసిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని అధికారులు వికలాంగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు.
సమస్యలపై త్వరలోనే జిల్లా అధికారులను కలిసి మాట్లాడుతామని ఆయన ఈ సందర్భంగా తోటి వికలాంగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కు ల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు బాలిరెడ్డి, హుస్సేన్ , రామారెడ్డి మండల నాయకులు స్వామి, కిష్టయా, సుజాత, రాజానర్స్, నరేందర్, శివరాజు, సత్తావ్వా తదితరులు పాల్గొన్నారు.