నిర్మాణ సంబంధ అభివృద్ధి కార్యక్రమాలు  కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

నిర్మాణ సంబంధ అభివృద్ధి కార్యక్రమాలు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 18

 

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక అవసరం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ ఇంజనీరింగ్ శాఖల వారీగా జిల్లాలో చేపట్టిన నిర్మాణ సంబంధం అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఇసుక అవసరం అవుతుంది. జిల్లాలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో ఆయా శాఖల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టర్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు అవసరమైన ఇసుక కోసం పోర్టల్ లో నమోదు చేసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.

 

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, గనులు భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నగేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment