కామారెడ్డి *జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వన్*
*ZPHS INC కామారెడ్డి* పాఠశాలను ఆకస్మిక సందర్శించడం జరిగింది
.
కామారెడ్డి. జిల్లా ఇన్‌ఛార్జ్
(ప్రశ్న ఆయుధం).8/7/2025
మంగళవారము రోజున పదవ తరగతి విద్యార్థులతో వారు చదువుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో కలిపిస్తున్న *మౌళిక వసతులు, అందిస్తున్న విద్య,MDM* పై విద్యార్థులతో చర్చించడం జరిగింది.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న *మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయడం* జరిగింది.
విద్యార్థులందరికీ ప్రతిరోజు *మెనూ ప్రకారం రుచికరమైన భోజనం* వడ్డించాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీని ఆదేశించడం జరిగింది.
ఉపాధ్యాయులందరూ *సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను* అందించేలా పాఠశాలలో విద్యార్థులందరికీ అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకి *ఏకరూప దుస్తులలో* వచ్చే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించడం జరిగింది
పాఠశాలలో ప్రతి విద్యార్థి *ఏక్ పెడ్ మా కె నామ్* అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని ఆ చెట్టును సంరక్షించే బాధ్యత ఆ విద్యార్థి తీసుకోవాలని ఆ చెట్టుకు ప్రతిరోజు నీళ్లు పోసి దాని రక్షణ బాధ్యత ఆ విద్యార్థి పూర్తిగా తీసుకోవాలని సూచించడం జరిగింది.
*సెలవులో వెళ్లే ఉపాధ్యాయులు ముందస్తుగా ప్రధానోపాధ్యాయులు అనుమతి తీసుకోవాలని సూచించడం జరిగింది* . విద్యార్థులందరికీ రెండవ జత యూనిఫామ్ పంపిణీని ప్రారంభించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ,మండల విద్యాధికారి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు