కామారెడ్డి జిల్లా కోర్టు తీర్పునే తప్పు పట్టిన కామారెడ్డి టి పి ఓ గిరిధర్

కామారెడ్డి జిల్లా కోర్టు తీర్పునే తప్పు పట్టిన కామారెడ్డి టి పి ఓ గిరిధర్

IMG 20250221 161941 1

ప్లాట్ కు రెండోసారి పర్మిషన్ ఇచ్చిన టిపిఓ

– కలెక్టర్ ను ఆశ్రయించిన బాధితుడు

IMG 20250221 161958 1 మున్సిపల్ పరిధిలోని ప్లాట్ కు టిపిఓ 2014 ఉన్న పర్మిషన్ చూసి 2024 లో మరో పర్మిషన్ ను కామారెడ్డి టి పి ఓ గిరిధర్ ఇచ్చారు. అప్పటికే ప్లాట్ ను కొనుగోలు చేసి అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకుని ఇంటి నెంబర్ తీసుకొని నివాసం ఉంటున్న వ్యక్తి వద్దనున్న కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని సైతం అది ఒరిజినల్ కాదని కామారెడ్డి డిపిఓ గిరిధర్ తిరస్కరించాడు. దీంతో సదర్ బాధితుడు సకినాల మహేష్ జిల్లా కలెక్టర్ ను గురువారం ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో గల 220 గుంటల విస్తీర్ణం గల భూమిని పట్టాదారులైన రషీద్ అలీ వద్ద తాను కొనుగోలు చేశాననీ, ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కామారెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ జిపి లీగల్ ఒపీనియన్ లిఖితపూర్వకంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసినారు అన్నారు. అదే విధంగా కామారెడ్డి మున్సిపాలిటీ వారు కూడా స్టాండర్డ్ కౌన్సిల్ వారి నుండి లిఖితపూర్వకంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని నాకు భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారన్నారు. నేను పర్మిషన్ తీసుకుని కాంపౌండ్ వాల్ నిర్మించి అందులో గదిని నిర్మించుకోవడం జరిగిందని దీనికి నల్ల కలెక్షన్ తీసుకొని హౌస్ నెంబర్ ను సైతం తీసుకోవడం జరిగిందన్నారు. అప్పటినుండి రెగ్యులర్ గా మున్సిపాలిటీకి పన్ను చెల్లిస్తూ వస్తున్నానన్నారు. 2022 లో ఇట్టి స్థలం మాదే అంటూ పోకల శంకరయ్య, పోకల మహేష్ కొందరు రౌడీలను తీసుకువచ్చి రాత్రి సమయంలో నా స్థలానికి నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేశారన్నారు. ఈ విషయంపై తెలుసుకున్న నేను అక్కడికి వెళ్లి అడ్డు చెప్పగా నన్ను చంపేస్తామని బెదిరించారాని దీనిపై తేదీ 7 – 5 – 2022న కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పోకల శంకరయ్య, మహేష్ లు ఇప్పటికి ఒకసారి ఇంటి పర్మిషన్ కోసం పరిమిషన్ దాఖలు చేసుకోగా తాను తన రిజిస్ట్రేషన్ కాగితాలు పరిమిషన్ లెటర్లను మున్సిపల్ లో చూపించగా అతడికి పర్మిషన్ ఇవ్వలేదన్నారు, అనంతరం 2014లో తనకు ఇంటి పర్మిషన్ ఇచ్చినట్లు చూపెడుతూ తిరిగి పర్మిషన్కు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుత టిపీఓ గిరిధర్ కు తన వద్ద ఉన్న కోర్టు కాపీలను చూపించగా ఇవి ఒరిజినల్ కాదని డూప్లికేట్ అని అతనికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ టిపిఓపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు ఈనెల 20న ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

Join WhatsApp

Join Now