Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం

IMG 20250919 WA0348

కామారెడ్డి జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 19

 

 

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయ‌న సాయుధ రిజర్వు పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ అధికారులు, సిబ్బందితో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల జిల్లాలో వచ్చిన వరదల సమయంలో ప్రతి పోలీస్ అధికారి చూపిన సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రశంసించారని గుర్తు చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్ట సిబ్బంది పనితీరుపైనే ఆధారపడుతుందని పేర్కొంటూ, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి వెంటనే రివార్డులు అందజేస్తామన్నారు. అయితే తప్పులు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

 

సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు గైర్హాజరు కాకూడదని, అవసరమైతే సరైన కారణంతోనే సెలవులు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విధుల్లో గాని, వ్యక్తిగత జీవితంలో గాని సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలియజేయవచ్చునని ఎస్పీ తెలిపారు. మంచి నిబద్ధతతో పనిచేసి కామారెడ్డి జిల్లాలో పోలీస్ శాఖ ప్రతిష్టను మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా హోంగార్డులకు రైన్ కోట్స్, వూలెన్ జెర్సీలు ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేయబడ్డాయి.

 

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, యెల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్, డీసీఆర్‌బీ సీఐ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, నవీన్, కృష్ణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version