కామారెడ్డి జిల్లా పట్టణ సీపీఐ నూతన కమిటీని ఏర్పాటు.
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం)జులై 31
ఈరోజు కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో కామారెడ్డి పట్టణ సిపిఐ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ హాజరై మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో వర్షాకాలం వల్ల పట్టణ ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి అని అన్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు , మురికి కాల్వాలు సరిగలేక డ్రైనేజీ నీరు పైకి వచ్చి ప్రజలు విష జ్వరాలతో అనేక ఇబ్బందులకు గురయ్యారని అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించినది అని అన్నారు. పట్టణ ప్రజలు విష జ్వరాలతో ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడం జరిగిందని కనీస తాగడానికి నీళ్లు,రోడ్లు సరిగలేక పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో ఫర్టిలైజర్ షాప్ లో జిల్లా రైతులకు నకిలీ విత్తనాలు అధిక రేట్లకు అమ్మడం జరుగుతుందని అదేవిధంగా వంటనునెను కూడా ఆయిల్ మిల్లు సంబంధించిన వ్యాపారులు ఆయిల్ కల్తీ చేయుట వల్ల పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు అనారోగ్యాలకు గురవుతున్నారని, అట్లాగే ప్రొఫైల్ స్కూల్ వద్దగల రైల్వే బ్రిడ్జి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పాలకులు మారిన సమస్య యధావిధిగా పైన బ్రిడ్జి కింద పోవడానికి ప్రజలు సౌకర్యం లాంటి బ్రిడ్జి నిర్మించాలని ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే మరియు అధికార పార్టీ నాయకులు కట్టుబడి ఉండాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోఅక్రమంగా ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్న మున్సిపల్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారని టీచర్స్ కాలనీ బతుకమ్మ కుంట విద్యానగర్ అశోక్ నగర్ చర్చి ప్రాంతం కొన్ని కాలనీలు ,ఇంద్రనగర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ,మాఫియా ఎదేచ్చగా చేస్తున్నారని అన్నారు. అట్లాగే నిత్య ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వీటిని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్కేం చేసారు .ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇందిరమ్మ పథకం ,పూర్తిగా సమీక్ష చేయాలని నిరుపేదలకు ఇండ్లు ,స్థలమున వారికి ఐదు లక్షల రూపాయలు ,మరియు పెన్షన్లు, రేషన్ కార్డులు ,కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ రైతుబంధు రైతు బీమా ,లాంటి పథకాలను అందించాలని ,గ్యాస్ ధర లాంటి పెట్రోల్ తగ్గించాలని అన్నారు .ఈ సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారన్నారు. మరియు ఆగస్టు 6 తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు గారు. కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి .పద్మ గారు. మరియు సిపిఐ కామారెడ్డి సీనియర్ నాయకులు వీఎల్ నరసింహారెడ్డి గారు ప్రముఖ న్యాయవాది హాజరవుతారని వారన్నారు.
………. అనంతరం కామారెడ్డి సిపిఐ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శిగా. పి బాలరాజ్. సహాయ కార్యదర్శులుగా. కే శ్రీనివాస్ రాజిరెడ్డి. పట్టణ కోశాధికారిగా ఎండి . రఫిక్. పట్టణ కమిటీ సభ్యులుగా డి అశోక్ భీమయ్య ఎం ప్రవీణ్ బాజీ పి శివప్రసాద్ అఖిల శ్యామల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది