టి జి పి ఎస్ సి గ్రూప్ వన్ రిజల్ట్ లో స్టేట్ 67వ ర్యాంకు సాధించిన కామారెడ్డి జిల్లా వాసి
– కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోఇటీవల విడుదల చేసినటువంటి టి జి పి ఎస్ సి గ్రూప్ వన్ రిజల్ట్ లో కామారెడ్డి జిల్లా వాసి 67వ ర్యాంక్ ను సాధించారు. గ్రూప్ 1 లో స్టేట్ 67వ ర్యాంకు సాధించిన చిన్న లచ్చ పేట కు చెందిన బుస ఉదయ్ కిరణ్ ను కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం మాచారెడ్డి మండలంలో గజ్యానాయక్ తండ రైతు వేదికలో సన్మానించరు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల తాసిల్దార్, ఎంపీడీవో, బిజెపి మండల అధ్యక్షులు సురేష్, నర్సింలు, బాలచంద్రం, హారిక, స్వామి గౌడ్, ప్రభాకర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.