కామారెడ్డి అటవీ విభాగం జట్టు గెలుపు ఘనత
రాజన్న జోనల్ స్థాయి క్రీడల్లో అద్భుత ప్రతిభ
కరీంనగర్‌లో అక్టోబర్ 7, 8న రాజన్న జోనల్ స్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహణ
కామారెడ్డి అటవీ విభాగం డీఎఫ్ఓ బోగా నిఖితా, ఐఎఫ్ఎస్ “కారమ్”లో మొదటి స్థానం
కబడ్డీ, వాలీబాల్, తగ్ ఆఫ్ వార్, షటిల్, అథ్లెటిక్స్‌లో కమారెడ్డి జట్టు ఆధిపత్యం
రాష్ట్రస్థాయి పోటీలకు విజేతల ఎంపిక
అటవీ సిబ్బంది కృషి, క్రమశిక్షణకు అధికారులు ప్రశంసలు
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 9:
రాజన్న జోనల్ స్థాయి క్రీడా పోటీలు అక్టోబర్ 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో కమారెడ్డి అటవీ విభాగం అద్భుత ప్రతిభ కనబరిచింది. డీఎఫ్ఓ శ్రీమతి బోగా నిఖితా (IFS) “కారమ్” విభాగంలో మొదటి స్థానం సాధించి జట్టుకు గౌరవం తెచ్చారు.
అటవీ సిబ్బందితో కూడిన కమారెడ్డి జిల్లా జట్టు పలు విభాగాల్లో ఆధిపత్యం చాటింది. కబడ్డీ (పురుషులు, మహిళలు), వాలీబాల్ (పురుషులు), తగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, అలాగే అథ్లెటిక్స్ మొత్తం విభాగంలో మొదటి స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ విజేతలందరూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అర్హత సాధించారు. కమారెడ్డి అటవీ సిబ్బంది క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
ఈ విజయాల సందర్భంలో బాన్సువాడ, కామారెడ్డి డివిజన్ అధికారులు సునీత, రామకృష్ణతో పాటు జిల్లా అటవీ అధికారి బోగా నిఖితా ఐఎఫ్ఎస్ పాల్గొన్న సిబ్బందిని అభినందించారు.