Headlines :
-
కామారెడ్డి: స్వప్నలోక్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
-
కంటి పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు: కామారెడ్డిలో ఉచిత వైద్య సేవలు
-
స్వప్నలోక్ కాలనీ వాసుల కోసం ఉచిత వైద్య శిబిరం: మందులు & కళ్లద్దాలు ఉచితంగా
ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 07, కామారెడ్డి టౌన్:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి స్వప్నలోక్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం & ఉచిత షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించబడునని స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడకల గోవర్ధన్ తెలిపారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ పల్స హరీష్ గౌడ్, డాక్టర్ దివ్య భారతి & ఆప్తమాలజిస్ట్ డాక్టర్ లింబాద్రిల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడునని, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేయబడునని తెలిపారు. కావున కాలనీవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.