కామారెడ్డి హరిత కాలనీలో కుంకుమార్చన ఘనంగా
భక్తి శ్రద్ధలతో నిత్యపూజలు, ఆలయ మండపం ప్రత్యేక ఆకర్షణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 4
కామారెడ్డి జిల్లా హరిత కాలనీలో భగ్వదళ్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఘనంగా కుంకుమ అర్చనలు నిర్వహించారు. అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు భక్తి శ్రద్ధలతో గణపయ్యకు నిత్యపూజలు జరుగుతున్నాయి.
ఆలయ మండపాన్ని ప్రత్యేకంగా మన తిరుపతి ఏడు ఆలయ ద్వార రూపంలో అలంకరించడం భక్తులను ఆకట్టుకుంటోంది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు గణపయ్యను దర్శించుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, భక్తజనాలు కలసి ఈ వేడుకను విజయవంతం చేస్తున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు
సాయి కృపన్ రెడ్డి, రుక్విత్ గౌడ్, నేత్ర సాయి, కృష్ణ సాయి,తరుణ్, అఖిలేష్, కమల్ శ్రీరామ్, గణేష్, సాయి ప్రసాద్, కార్తీక్. మిగతా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు