కామారెడ్డి విద్యార్థుల ఘన విజయం

కామారెడ్డి విద్యార్థుల ఘన విజయం

— రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లో 19 మెడల్స్ – నేషనల్ లెవెల్‌కి ఎంపిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16

 

ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన 6వ రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్ పోటీలలో కామారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు (కేజీబీవీ విద్యార్థులు) ఘనవిజయం సాధించారు. వివిధ విభాగాల్లో మొత్తం 12 గోల్డ్, 3 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ గెలిచి, మొత్తంగా 19 మెడల్స్ పథకాలను సొంతం చేసుకున్నారు. దీంతో తొలిసారిగా రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కామారెడ్డి జిల్లా సాధించి, నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికయ్యారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విజేతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేషనల్ స్థాయి పోటీల్లో కూడా పట్టుదలతో శ్రమించి పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

సబ్ జూనియర్ విభాగంలో విజయాలు:

జోష్ణ–సునీత రిధమిక్ పెయిర్‌లో గోల్డ్ మెడల్

బి. నికిత ఆర్టిస్టిక్ సింగిల్ (గర్ల్స్) – సిల్వర్

కవిత లెగ్ బ్యాలెన్సింగ్ – సిల్వర్

సిందుజా హ్యాండ్ బ్యాలెన్సింగ్ – గోల్డ్

విగ్నేశ్వరి సుపైన్ ఇండివిడ్యువల్ – గోల్డ్

సిరిశా–వైష్ణవి ఆర్టిస్టిక్ పెయిర్ – సిల్వర్

అంజలి ట్రెడిషనల్ విభాగం – ఐదవ స్థానం

విఘ్నేష్ (బాయ్స్ సుపైన్) – బ్రాంజ్

జూనియర్ విభాగంలో విజయాలు:

సహస్ర–సరస్వతి రిధమిక్ పెయిర్ – ప్రథమ స్థానం

సహస్ర ట్విస్టింగ్ బాడీ – గోల్డ్, లెగ్ బ్యాలెన్సింగ్ – గోల్డ్

సరస్వతి బ్యాక్ బెండింగ్ – గోల్డ్, ఆర్టిస్టిక్ సింగిల్ – బ్రాంజ్

స్రవంతి–శైలిశ్రీ ఆర్టిస్టిక్ పెయిర్ – గోల్డ్

శ్రావంతి హ్యాండ్ బ్యాలెన్సింగ్ – గోల్డ్

కృప సుపైన్ ఇండివిడ్యువల్ – గోల్డ్

హరిణి ట్విస్టింగ్ బాడీ – బ్రాంజ్

నవదీప్ జూనియర్ బాలుర విభాగంలో బ్యాక్ బెండింగ్ – గోల్డ్, హ్యాండ్ బ్యాలెన్స్ – గోల్డ్, ఆర్టిస్టిక్ సింగిల్ – బ్రాంజ్

మొత్తం విజయాలు:

గోల్డ్ మెడల్స్ – 12

సిల్వర్ మెడల్స్ – 3

బ్రాంజ్ మెడల్స్ – 4

మొత్తం = 19 మెడల్స్

ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రంగ వెంకటేశ్వర్ గౌడ్, జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అధ్యక్షులు యోగ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, జీసీఈఓ సుకన్య, కోచ్‌లు గోమతి, లలిత, భరత్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment