ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా కృషి చేస్తాం

జర్నలిస్టుకు
Headlines:
  1. ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందేలా కృషి – టీయూడబ్ల్యూజే
  2. కామారెడ్డిలో జర్నలిస్టుల సమస్యలపై చర్చ
  3. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యూజే నిబద్ధత
  4. జనవరిలో ఎల్లారెడ్డిలో జరగనున్న తదుపరి సమావేశం
  5. జర్నలిస్టుల హక్కుల కోసం కార్యవర్గం నిర్ణయాలు
టీయూడబ్ల్యూజే ( ఐజేయు ) ఎలాక్ట్రానిక్ మీడియా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

ప్రశ్న ఆయుధం, నవంబర్ 23, కామారెడ్డి :

టీయూడబ్ల్యూజే ( ఐజేయు ) ఎలక్ట్రానిక్ మీడియా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం జిల్లా కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యుడు వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ఎ లతీఫ్, జిల్లా అధ్యక్షుడు రజినికాంత్ ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
ఈ సంధర్భంగా జిల్లాలోని హెల్త్ కార్డులు, జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ళ స్థలాలు అందేలా చూస్తామన్నారు. ఎల్లారెడ్డిలో వచ్చే సంవంతరం జనవరి నెలలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశామన్నారు. అదేవిధంగా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గా ఎలక్ట్రానిక్ మీడియా నుండి అవకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చందు, ఉపాధ్యక్షులు అబిద్, సాయిరాం గౌడ్, రామేశ్వరరావు, రంజిత్, సంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment