రైతు మహోత్సవ సభను సందర్శించిన కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
నిజామాబాదులో సోమవారం ప్రారంభమైన రైతు మహోత్సవ సభను కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లోకేటి సుదర్శన్ రావు సోమవారం రోజు సందర్శించారు.ఇ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకోటి యమునకు ప్రభుత్వ సబ్సిడీపై పవర్ విడర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పవర్ విడర్ అసలు ధర 63000 కాగా, రైతు వాటా 33000, గవర్నమెంట్ సబ్సిడీ 30000 రూపాయలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హిమ వర్షా అగ్రికల్చర్ కామారెడ్డి ద్వారా ఆ పవర్ విడర్ ను అందించడం జరిగిందనీ పేర్కొన్నారు.