Site icon PRASHNA AYUDHAM

కనీస సౌకర్యాలు లేని కామారెడ్డి మార్కెట్.

కనీస సౌకర్యాలు లేని కామారెడ్డి మార్కెట్..

ఎలాంటి బాత్రూం సౌకర్యం,వాటర్ సౌకర్యం లేకుండా నిర్వహణ.

బుర్థ నీటిలో కూరగాయలు పెట్టి అమ్మేపరిస్తితి.

తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, కామరెడ్డి ప్రజలు విజ్ఞప్తి.

 

 

కామారెడ్డి లోని హోల్సేల్ మార్కెట్లో నిత్యం 100 గ్రామాల నుంచి వచ్చేటటువంటి రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా కామారెడ్డి మార్కెట్ నిర్వహణ,పురపాలక సంఘం నిర్లక్ష్యం అలాగే కామారెడ్డి నలుమూలల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు ఎలాంటి బాత్రూం సౌకర్యం గాని వాటర్ సౌకర్యం గాని ఏర్పాటు చేయకపోవడం రైతులను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది. అదే కాకుండా కామరెడ్డి నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అదే మార్కెట్లో నుంచి ప్రవహించిన బురద లో కూరగాయలు పెట్టి ప్రజలకు వాటినే విక్రయించడం వలన ఎన్నో అంటువ్యాధులు మలేరియా , డెంగ్యూ ఇంకా ఏదైనా రోగాలు రావచ్చు అని కామారెడ్డి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.దీనిపై ఉన్నంత అధికారులు దృష్టిసరించి తగిన చర్యలు తీసుకోవాలని అటు రైతులు కామరెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు…..

Exit mobile version