మాల పోచమ్మ ఆలయానికి గ్రానైట్ రాయిని అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే

మాల పోచమ్మ ఆలయానికి గ్రానైట్ రాయిని అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం జనవరి 17కామారెడ్డి

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి బిజెపి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలోని బిబిపేట మండలం, ఉప్పరిపల్లి గ్రామం మాల పోచమ్మ ఆలయానికి శుక్రవారం గ్రానైట్ రాయి నీ అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి మాలపోచమ్మ కులస్తులు కామారెడ్డి బీజేపీ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా బిజెపి కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బట్టుపల్లి రంజిత్ గౌడ్, బిజెపి జిల్లా ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి నక్క రవీందర్ , బీజేవైఎం మండల అధ్యక్షులు పోసు శివ కుమార్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అల్లం ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పిడుగు శ్రీనివాస్, భూతు అధ్యక్షులు బైండ్ల బాలునర్సు ,కార్యకర్తలు తేజ, మన్నే వేణు, ఉప్పర్ పల్లి మాలపోచమ్మ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now