కామారెడ్డి నూతన మత్స్యశాఖ ఇంచార్జిగా కె.డోలిసింగ్ బాధ్యతలు స్వీకరణ
కలెక్టర్ అశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 17 :
కామారెడ్డి జిల్లా కొత్త మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.ఇంతకుముందు కామారెడ్డిలో మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన పి. శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయినట్లు శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కె. డోలిసింగ్ గతంలో నిజాంసాగర్‌లోని మత్స్య విత్తన క్షేత్రంలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కూడా అదే విత్తన క్షేత్రానికి ఇంచార్జిగా కొనసాగుతారని తెలిపారు.
ఈ నియామకానికి సంబంధించి మత్స్యశాఖ డైరెక్టర్ డా. కే. నిఖిల, IAS ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.