నూతన పరిశోధనలకు కామారెడ్డి సైన్స్ ఫెయిర్ కేంద్రబిందువు కావాలి

నూతన పరిశోధనలకు కామారెడ్డి సైన్స్ ఫెయిర్ కేంద్రబిందువు కావాలి

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా జనవరి 07:

నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు కామారెడ్డి సైన్స్ ఫెయిర్ వేదికగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని అబ్దుల్ కలాం ప్రాంగణం, విద్యానికేతన్ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ మనక్ అవార్డ్స్ మరియు 53వ రాష్ట్రస్థాయి బాల్ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను ఆయన సోమవారం సందర్శించి సమీక్షించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి మొత్తం 887 సైన్స్ ప్రదర్శనలు ఈ సైన్స్ ఫెయిర్‌కు రానున్న నేపథ్యంలో, వాటిని ఏడు అంశాల వారీగా విభజించి ప్రత్యేక గదులను కేటాయించినట్లు తెలిపారు. ప్రతి విభాగానికి ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తూ మొత్తం 27 విభాగాల కమిటీలు పని చేస్తున్నాయని వివరించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, విజ్ఞానశాస్త్ర అభిమానులు, భావితరాల శాస్త్రవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా మంచినీటి, భోజన వసతులు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు.

భావి శాస్త్రవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే వారిలో కొత్త ఆలోచనలు వికసిస్తాయని, రాబోయే తరాలకు ఉపయోగపడే పరిశోధనల దిశగా వారి ఆలోచనా దృక్పథం పెరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే అయినప్పటికీ, ఆధునికత వేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో నూతన ఆవిష్కరణల అవసరం ఎంతో కీలకమైందని, ఆ దిశగా కామారెడ్డి సైన్స్ ఫెయిర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment