బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి సోషల్ మీడియా సి ఇ ఒ గా బొమ్మెర స్రవంతి
కామారెడ్డి జిల్లా బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి సీఈవోగా బొమ్మర స్రవంతిని నియమిస్తున్నట్లు న్యాయవాది, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాసరాజేశ్వర్ తెలిపారు. ఈనెల 4 న హైదరాబాద్లో జరిగిన బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో కామారెడ్డి జిల్లా నుండి బీసీల గురించి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేస్తున్న స్రవంతిని గుర్తించి ఆమెను కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా సీఈఓ గా నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గం సోషల్ మీడియా సీఈఓ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఈ బాధ్యత అప్పగించిన వారి నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు.